- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేషెంట్‌లా బీహార్ కొత్త హెల్త్ మినిస్టర్.. నెట్టింట ట్రోల్స్
మాజీ సీఎం నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ బీహార్ కొత్త ఆరోగ్యశాఖ మంత్రిగా బాధత్యలు స్వీకరించారు. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపర్చడానికి తాను నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ బీహార్ కొత్త ఆరోగ్యశాఖ మంత్రిగా బాధత్యలు స్వీకరించారు. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపర్చడానికి తాను నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన తెలిపారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తన బాధ్యతలను అంకితభావంతో నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. తన బాధ్యతను పూర్తి నిజాయితీతో నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించడానికి కృషి చేస్తానని చెప్పారు. అయితే బాధ్యతలు చేపట్టకముందే నితీష్ కుమార్ పేరును ఆరోగ్యశాఖమంత్రిగా ప్రకటించిన తరవాత నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి.
నిశాంత్ కుమార్ చూడటానికి పేషెంట్ లా కనిపిస్తున్నాడు. కనీసం అతడు సరిగ్గా నిలుచోలేకపోతున్నాడు. కుర్చీలో కూర్చోబెట్టినా తూలుతూ కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇతనే పేషంట్ లా ఉంటే ఇంకా ఆరోగ్యశాఖను ఏం చూస్తాడని కామెంట్ చేస్తున్నారు. బీహార్ పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నారు. మత్తుకు బానిసయ్యే ఇలా తయారయ్యి ఉంటాడని విమర్శిస్తున్నారు. తండ్రి మాజీ సీఎం కాబట్టి కొడుకు పదవి అనుభవిస్తున్నాడు తప్ప మరేం లేదని అయినా ఈయనకు ఓటు వేసి గెలిపించిన జనాలకు ఇది జరగాల్సిందేనని ఫైర్ అవుతున్నారు.






