నరాలు తెగే ఉత్కంఠ.. కేవలం 30 ఓట్ల తేడాతో గెలుపు

by Malleboina Mahesh |

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పదుల సంఖ్యలో అభ్యర్థులు అత్యల్ప తేడాతో ఓడిపోగా.. తక్కువ ఓట్లతోనే పలువురు విజయం సాధించారు. ఇలాంటి ఘటనలే ప్రతి ఓటు విలువను నిరూపిస్తాయి.

నరాలు తెగే ఉత్కంఠ.. కేవలం 30 ఓట్ల తేడాతో గెలుపు
X

దిశ, వెబ్ డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) పలితాలు దేశ ప్రజలకు క్లియర్ కట్ మెసేజ్ పంపాయి. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా.. ఎన్డీయే కూటమి చేసిన అభివృద్ధి పనులకు ప్రజలు పట్టం కట్టారు. దీంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సైతం మించుతూ.. బిహార్‌లో ఎన్డీయే కూటమి ఏకంగా 202 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో పదుల సంఖ్యలో అభ్యర్థులు అత్యల్ప తేడాతో ఓడిపోగా.. తక్కువ ఓట్లతోనే పలువురు విజయం సాధించారు. ఇలాంటి ఘటనలే ప్రతి ఓటు విలువను నిరూపిస్తాయి.

చివరి నిమిషం వరకు నరాలు తెగె ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో రామ్‌గఢ్ సీటులో బిఎస్‌పి అభ్యర్థి (BSP candidate) సతీష్ కుమార్ సింగ్ యాదవ్ కేవలం 30 ఓట్ల తేడాతో గెలిచినారు. ఈ గెలుపుతో ప్రతి ఓటు ఎంత ముఖ్యమో స్పష్టం అయింది. చివరి రౌండ్ వరకు బీఎస్సీ, బీజేపీ అభ్యర్థుల మధ్య దోబుచిలాడిన విజయం చివరకు 30 ఓట్ల తేడాతో బీఎస్పీ అభ్యర్తిని వరించింది. ఈ ఘర్షణాత్మక పోరులో బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలవగా, ఆర్జెడి మూడో స్థానంలో నిలిచింది. ప్రజాస్వామ్యంలో చిన్న తేడాలు ఎంత బలంగా ప్రభావం చూపగలవో ఈ గెలుపు మరోసారి గుర్తు చేస్తుంది.

Next Story