- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజకీయాల్లోకి బిహార్ సీఎం నితీశ్ కుమార్ తనయుడు..!
బిహార్(Bihar) సీఎం, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్ (Nishant Kumar)రాజకీయాల్లోకి రానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్(Bihar) సీఎం, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్ (Nishant Kumar)రాజకీయాల్లోకి రానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరికొన్ని నెలల్లో బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో నిశాంత్ రాజకీయాల్లోకి రానున్నట్లు వస్తున్న వార్తలపై బిహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రావణ్ కుమార్ స్పందిచారు. . సోమవారం బల్లియాలోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. నిశాంత్ రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది ఆయన తండ్రి నీతీశ్ కుమార్ చేతుల్లోనే ఉందన్నారు. శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘నిశాంత్ రాజకీయాల్లోకి వస్తారా? లేదా అనేది పూర్తిగా నీతీశ్ కుమార్ చేతుల్లోనే ఉంది. ఆయన ఆమోదం లేకుండా సాధ్యం కాదు. నిశాంత్ కుమార్‌కు బిహార్ రాజకీయ పరిస్థితులపై అవగాహన, పట్టు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అన్నారు.
ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి ఎందుకు హాజరు కాలేదంటే?
అంతేకాకుండా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారోత్సవానికి నీతీశ్ హాజరు కాకపోవడానికి గల కారణం ఏంటో కూడా మంత్రి వివరించారు. సీఎంకు నలందలో ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమం ఉన్నందునే రాలేకపోయారని వెల్లడించారు. జేడీయూ తరఫున సంజయ్ ఝా, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ హాజరయ్యారన్నారు. ఇటీవలే నిశాంత్ పాట్నాలోని ఏ కార్యక్రమంలో ప్రసంగించారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి ఓటువేయాలని ప్రజలను కోరారు. అయితే, తన రాజకీయ అరంగేట్రం గురించి అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేశారు. మరోవైపు, నితీశ్ కుమార్ ఏకైక కుమారుడు నిశాంత్ గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. కాగా.. నిశాంత్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేశాడు.






