బిహార్ ఎన్నికల ఎఫెక్ట్.. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గింపు

by Muthe.Rajitha |

బిహార్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రభావం... గ్యాస్ సిలిండర్ ధరలపై పడింది.

బిహార్ ఎన్నికల ఎఫెక్ట్.. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గింపు
X

దిశ, వెబ్ డెస్క్ : బిహార్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రభావం... గ్యాస్ సిలిండర్ ధరలపై పడింది. గ్యాస్ సిలిండర్ ధరలు రూ. 5 తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ తగ్గింపు వాణిజ్య సిలిండర్లపై మాత్రమే ఉండనుంది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఎల్పీజీ వాణిజ్య సిలిండర్‌(19 కిలోలు) ధరలను ఐదు రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం ఎల్పీజీ వాణిజ్య సిలిండర్‌(19 కిలోలు) ధర రూ.1595 కాగా.. నవంబర్‌ 1 నుంచి రూ.1590కి తగ్గుతుంది. కాగా, నవంబర్‌ 1 నుంచి సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులూ ప్రకటించలేదు చమురు మార్కెటింగ్‌ సంస్థలు.

ఈనెల 6న, 11న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు గ్యాస్ ధరలు తగ్గించడం, అది కూడా వాణిజ్య సిలిండర్లపై మాత్రమే అది వర్తించనుండటం.. ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story