- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజీనామా చేసిన ముఖ్యమంత్రి
by Gantepaka Srikanth |
బిహార్ రాజకీయ దిగ్గజం, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బిహార్ రాజకీయ దిగ్గజం, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం (మార్చి 30, 2026) ఆయన తన శాసనమండలి (Legislative Council) సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈనెలలో ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడంతో, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒకేసారి రెండు సభల్లో సభ్యత్వం కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నితీష్ కుమార్ తన రాజీనామా పత్రాన్ని నేరుగా శాసనమండలి కార్యాలయానికి పంపారు. దీనిని మండలి తాత్కాలిక చైర్మన్ ఆమోదించినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, నితీశ్ కుమార్ ఏప్రిల్ 9న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఇప్పటివరకు పదిసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన కెరీర్‌ను "కూటమి రాజకీయాల్లో మాస్టర్ క్లాస్"గా అభివర్ణిస్తారు.
Next Story






