ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు.. ఎన్నికల ముందు బిహార్ సీఎం నితీశ్ ప్రకటన

by Phanindra |   (  Updated:2025-07-13 16:06:11  IST  )

ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు అందిస్తామని బిహార్ సీఎం నితీశ్ ప్రకటించారు. గత ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని దాదాపు పూర్తిచేశామన్నారు.

ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు.. ఎన్నికల ముందు బిహార్ సీఎం నితీశ్ ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే ఐదేళ్లలో బిహార్ ప్రభుత్వం కోటి ఉద్యోగాలు అందిస్తుందని సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. ఈ క్రమంలో యువతకు నైపుణ్యాలు అందించేందుకు ‘జననాయక కర్పూరి ఠాకూర్ స్కి్ల్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన కీలకంగా మారింది. ‘వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిచ్చి 2020-2025 లక్ష్యాలను డబుల్ చేయాలని అనుకుంటున్నాం.

ప్రైవేట్ సెక్టార్లో మరీ ముఖ్యంగా ఇండస్ట్రియల్ రంగంలో కూడా భారీగా ఉద్యోగావకాశాలు సృష్టిస్తాం. దీని కోసమే హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం’ అని నితీశ్ కుమార్ తెలిపారు. ‘ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో 10 లక్షల మందికి ఉపాధి లభించింది. ఓవరాల్‌గా 39 లక్షల మందికి ఎంప్లాయిమెంట్ లభించింది. కాబట్టి 50 లక్షల మందికి ఉపాధి అందించాలనే లక్ష్యం కచ్చితంగా అందుకుంటాం’ అని ఆయన చెప్పారు.

అలాగే ‘సాత్ నిశ్చయ్’ కార్యక్రమంలో భాగంగా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రోగ్రామ్‌ను వచ్చే ఐదేళ్లలో మరింత విస్తృతం చేస్తామని, జననాయక్ కర్పూరి ఠాకూర్ స్కిల్ యూనివర్సిటీ పేరిట ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

Next Story