ఢిల్లీ సీఎంను కలిసిన బీహార్ సీఎం.. ఆ విషయంలో మద్దతు

by Disha Web Desk 12 |
ఢిల్లీ సీఎంను కలిసిన బీహార్ సీఎం.. ఆ విషయంలో మద్దతు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో బ్యూరోక్రాట్ల నియామకాలు, పోస్టింగ్‌లను పరిశీలించడానికి ప్రత్యేక అధికారాన్ని రూపొందించడానికి కేంద్రం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీంతో ఈ విషయంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆదివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను దేశ రాజధానిలోని ఆయన నివాసంలో కలిసి మద్దతు తెలిపారు. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ఇచ్చిన అధికారాలను ఎలా తీసివేస్తారని.. వారు ప్రశ్నించారు. దీంతో ఢిల్లీ సీఎంను బీహార్ సీఎం కలవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed