Gaya : గయా జిల్లా పేరు మార్చిన బీహార్

by Muthe.Rajitha |

గయా(Gaya) జిల్లా పేరు మారుస్తూ బీహార్ కేబినెట్(Bihar Cabinet) నిర్ణయం తీసుకుంది.

Gaya : గయా జిల్లా పేరు మార్చిన బీహార్
X

దిశ, వెబ్ డెస్క్ : గయా(Gaya) జిల్లా పేరు మారుస్తూ బీహార్ కేబినెట్(Bihar Cabinet) నిర్ణయం తీసుకుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్(Bihar CM Nithish Kumar) అధ్యక్షతన నేటి సాయంత్రం జరిగిన క్యాబినెట్ సమావేశంలో గయా జిల్లా పేరును "గయాజీ"(Gayaji)గా మార్చడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గయా యొక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను గౌరవిస్తూ.. ఈ ప్రాంతాన్ని ఇక్కడి ప్రజలు గయాజీ అని పిలుస్తారని.. తాజా మార్పుతో అది కాగితాల్లోకి కూడా వచ్చిందని కేబినెట్ పేర్కొంది. కాగా హిందూ, బౌద్ధ, జైన మతాలలో పితృపక్షంలో పిండదానం వంటి ఆచారాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధమైనది. ఈ ప్రాంతానికి "జీ" అనే గౌరవప్రదమైన పదాన్ని జోడించడం ద్వారా తీసుకోబడింది. ఈ కేబినెట్ సమావేశంలో ఆపరేషన్ సిందూర్‌లో అమరులైన జవాన్ కుటుంబానికి రూ. 50 లక్షల సాయం వంటి ముఖ్య నిర్ణయం కూడా తీసుకున్నారు.

Next Story