ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. రెండోదశలో రికార్డు స్థాయిలో పోలింగ్

by Naga Rani Yarlagadda |

బిహార్ లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటలకు ముగిసింది.

ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. రెండోదశలో రికార్డు స్థాయిలో పోలింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 20 జిల్లాల్లో 120 అసెంబ్లీ స్థానాలకు రెండోదశ ఎన్నికలు జరగ్గా.. సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ నమోదైంది. 6 గంటలలోపు క్యూ లైన్లలో ఉన్న ఓటర్లకు ఓట్లు వేసే అవకాశం ఇచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనుండగా.. ఈ నెల 14న బిహార్ ఫలితం తేలనుంది.

అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, హిందూస్తాన్ ఆవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలు ఉండగా.. ప్రతిపక్షమైన మహాఘట్ బంధన్ కూటమిలో రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్), వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఇండియన్ ఇన్ క్లూజివ్ పార్టీ, జనశక్తి జనతా దళ్ వంటి పార్టీలున్నాయి. రెండు కూటముల మధ్య ప్రధాన పోటీ జరగ్గా.. అధికార ఎన్డీయే కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా ? లేక తేజస్వీ యాదవ్ బిహార్ బాద్షా అవుతారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

Next Story