- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిహార్ ఎన్నికలు.. మధ్యాహ్నం 3 గంటల వరకూ రికార్డు స్థాయిలో ఓటింగ్
బిహార్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చురుగ్గా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చురుగ్గా కొనసాగుతోంది. తొలిదశలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్ల నియోకజకవర్గాలకు పోలింగ్ జరగ్గా.. నేడు (నవంబర్ 11) రెండో దశ పోలింగ్ లో భాగంగా 20 జిల్లాల్లో 120 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. తొలిదశలో 64.66 శాతం పోలింగ్ నమోదవ్వగా.. రెండో దశలో మధ్యాహ్నం 3 గంటల వరకే 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. రెండోదశ ఎన్నికల పోలింగ్ రికార్డు స్థాయిలో ఉండబోతున్నట్లు అధికారులు తెలిపారు.
మధ్యాహ్నం 1 గంట సమయానికే 47 శాతానికి పైగా పోలింగ్ నమోదవ్వగా.. తొలిదశలో ఈ సమయానికి నమోదైన ఓటింగ్ శాతం ఇంతకంటే 5 శాతం తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. అధికారిక లెక్కల ప్రకారం.. గయ, జమూయి, బంకా జిల్లాల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదవ్వగా.. తూర్పు, పశ్చిమ చంపారన్, పూర్నియా, కతిహార్ వంటి ఇతర జిల్లాల్లోనూ 48 శాతానికి పైగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉండే కిషన్ గంజ్ జిల్లాల్లో మధ్యాహ్నం 1 గంట వరకూ 51.86 శాతం పోలింగ్ నమోదవ్వగా.. ఇది విశ్లేషమని అధికారులు చెప్తున్నారు.






