- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. 50 మందితో మొదటి జాబితాను ప్రకటించిన జేడీయూ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎన్డీయే కూటమి వరుసపెట్టి అభ్యర్థులను ప్రకటిస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి (NDA alliance) ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కూటమి పార్టీలు సీట్ల పంపకాలు చేసుకోగా.. బీజేపీ మంగళవారం 71 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. కాగా ఈరోజు అధికార జేడీయూ (JDU) కూడా 50 మంది అభ్యర్థులతో మొదటి జాబితా (First list)ను విడుదల చేసింది. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు జనతాదళ్ (యునైటెడ్) 57 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది.
ఎన్డీఏ సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం ఆ పార్టీ 101 సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించింది. బీజేపీ కూడా 101 సీట్లలో పోటీ చేయడానికి అవకాశం కల్పించింది. తన జాబితాను విడుదల చేసిన మొదటి ఎన్డీఏ పార్టీ ఇదే. ఇప్పుడు, టికెట్ల పంపిణీ పై పలువురు నాయకుల అభ్యంతరాల మధ్య జెడియు తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇదిలా ఉంటే జెడి(యు) సిట్టింగ్ ఎమ్మెల్యే గోపాల్ మండల్ టికెట్ కోరుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంటి వెలుపల 4 గంటలకు పైగా ధర్నా చేశారు.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన మళ్ళీ టికెట్ ఇవ్వకపోతే తాను కదలనని చెప్పిన విషయం తెలిసిందే. ఏది ఏమైనప్పటికి ఎన్డీయే కూటమి తో పొత్తు కారణంగా జేడీయూ సీట్లు తగ్గడంతో.. ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడమే లక్ష్యంగా చేసుకొని నితీష్ కుమార్ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తుంది.






