- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. తుది ఓటర్ల జాబితా విడుదల
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై విపక్షాలు ఆందోళనలు కొనసాగుతోన్న వేళ బిహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా విడుదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై విపక్షాలు ఆందోళనలు కొనసాగుతోన్న వేళ బిహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా విడుదలైంది. అయితే, తుది ఓటర్ల జాబితా, డ్రాఫ్ట్ జాబితాతో పోలిస్తే నమోదిత ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం.. పట్నా జిల్లాలో ఓటర్ల మొత్తం సంఖ్య ప్రస్తుతం 48,15,294గా ఉంది. ఆగస్టు 1, 2025న విడుదలైన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో 46,51,694 ఓటర్లు నమోదయ్యారు. ఒక నెల రోజుల పాటు అభ్యంతరాల ప్రక్రియ చేపట్టిన తర్వాత పట్నా జిల్లాలో తుది జాబితాలో 1,63,600 మంది ఓటర్లు పెరిగారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడుతూ.. తుది ఓటరు జాబితాపై ఏమైనా సందేహాలు ఉంటే ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఈ జాబితా ఆధారంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాగా, వచ్చే వారం బిహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉంది.






