- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bihar Assembly: దుమ్ములేపిన చిరాగ్ పాశ్వాన్.. వందకు వంద శాతం స్ట్రైక్ రేట్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) వందకు వంద శాతం స్ట్రైక్ రేట్తో దూసుకెళ్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) వందకు వంద శాతం స్ట్రైక్ రేట్తో దూసుకెళ్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం.. ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 22 స్థానాల్లో అన్ని చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2020లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న ఎల్జేపీ(ఆర్వీ)కి ఇది అత్యంత పెద్ద విజయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ(ఆర్వీ) 137 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. కానీ, ఈ ఎన్నికల్లో నీతీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్ కలిసి పోటీ చేసి దూకుడుగా సాగించిన ప్రచారంతో ఆర్జేడీ ఓటును చీల్చింది. అయితే, ఏపీలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ మాదిరిగా చిరాగ్ పాశ్వాన్ పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్తో దూసుకెళ్తోంది.






