రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెట్.. నలుగురికి తీవ్ర గాయాలు

by Sujitha Rachapalli |

బీహార్‌లో విషాదం చోటు చేసుకుంది. కన్వరియన్లకు చెందిన డీజే వ్యాన్ నీటి గుంతలో పడిపోయి.. ఐదుగురు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సుల్తాన్ గంజ్‌లో స్నానాలు ఆచరించిన కన్వరియన్లు.. జ్యేష్ గౌర్ నాథ్‌కు గంగాజలం సమర్పించేందుకు వెళ్తున్నారు.

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెట్.. నలుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్‌లో విషాదం చోటు చేసుకుంది. కన్వరియన్లకు చెందిన డీజే వ్యాన్ నీటి గుంతలో పడిపోయి.. ఐదుగురు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సుల్తాన్ గంజ్‌లో స్నానాలు ఆచరించిన కన్వరియన్లు.. జ్యేష్ గౌర్ నాథ్‌కు గంగాజలం సమర్పించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో షాకుండ్‌ పీఎస్ పరిధిలోని సుల్తాన్ గంజ్ ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. వ్యాన్‌కు విద్యుత్ తీగలు తగలడంతో బ్యాలెన్స్ తప్పి గుంతలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందిలో ఐదుగురు వ్యాన్ కింద పడి నలిగి చనిపోగా.. బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు నలుగురు. వీరిలోనూ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Next Story