- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. అధికార డీఎంకేలో చేరిన పన్నీర్‌సెల్వం
అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకేకు ఊహించని షాక్ తగిలింది. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ఇవాళ అధికార డీఎంకే పార్టీలో చేరారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే (AIADMK) సమన్వయకర్త, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం (Panneerselvam) ఇవాళ అధికార డీఎంకే (DMK) తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ఇవాళ సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరనున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
దివంగత జయలలిత (Jayalalitha)కు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న పన్నీర్‌సెల్వం, అన్నాడీఎంకేలో ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami)తో జరిగిన ఆధిపత్య పోరులో పరాజయం పాలై పార్టీకి దూరమయ్యారు. సుదీర్ఘ కాలం పాటు ఒంటరి పోరాటం చేసిన ఆయన, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకేలో చేరాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దక్షిణ తమిళనాడులో పట్టున్న పన్నీర్‌సెల్వం డీఎంకేలో చేరిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన సామాజిక వర్గ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. బలమైన ప్రతిపక్షం లేకుండా చేసే వ్యూహంలో భాగంగానే డీఎంకే అధినేత స్టాలిన్ పన్నీర్‌సెల్వం చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.






