- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేషనల్ హెరాల్డ్ కేసులో బిగ్ ట్విస్ట్.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలోని ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shiva Kumar)తో పాటు ఆయన సోదరుడు, ఎంపీ డీకే సురేష్ (DK Suresh)లకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో యంగ్ ఇండియన్ (Young Indian) సంస్థకు ఇచ్చిన రూ.2.5 కోట్ల విరాళాల వివరాలు, మూలం, ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లు డిసెంబర్ 19లోపు సమర్పించాలని ఆదేశించింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరైనా.. డాక్యుమెంట్లు పంపినా సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు. ఆ నోటీసులలో ప్రధానంగా యంగ్ ఇండియన్‌కు ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆ డబ్బు ఎందుకు ఇచ్చారు.. ఏ ఉద్దేశ్యంతో ఇచ్చారో చెప్పాలన్నారు. అందుకు డొనేషన్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, AICC నేతలతో ఈ లావాదేవీపై ఏదైనా చర్చ జరిగిందా? ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పాలంటూ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ పోలీసులు డీకే శివకుమార్‌కు ఇచ్చిన నోటీసుల్లో ప్రశ్నల వర్షం కురిపించారు.
కాగా, సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)లు యంగ్ ఇండియన్ సంస్థలో 38 శాతం చొప్పున షేర్లు కలిగి ఉన్నారని ఈడీ ఆరోపించింది. ఏజేఎల్‌కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.90.21 కోట్ల రుణాన్ని రూ.9.02 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్చి.. ఆ షేర్లను రూ.50 లక్షలకు యంగ్ ఇండియన్‌కు బదిలీ చేశారని పేర్కొంది. తద్వారా రూ.2 వేల కోట్ల నుండి రూ.5 వేల కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులపై నియంత్రణ సాధించారని ఈడీ ఆరోపించింది. దీంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) సెక్షన్లు 3, 4, మరియు 70 కింద వారిపై ఛార్జిషీటు దాఖలు చేశారు. ఏప్రిల్ 11, 2025న ఈడీ ఢిల్లీ, ముంబై, లక్నోలలో రూ.661 కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులను సైతం ఆటాచ్ చేసిన విషయం తెలిసిందే.






