టీవీకే అధినేత విజయ్‌కు బిగ్ షాక్.. పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

by Naga Rani Yarlagadda |

ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ కు మద్రాస్ హైకోర్టు బిక్ షాకిచ్చింది.

టీవీకే అధినేత విజయ్‌కు బిగ్ షాక్.. పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ కు మద్రాస్ హైకోర్టు బిక్ షాకిచ్చింది. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆయనకు విధించిన పెనాల్టీకి వ్యతిరేకిస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను విజయ్ రూ.1.50 కోట్ల జరిమానా చెల్లించాలని ఐటీశాఖ నోటీసులు జారీ చేయగా.. 2022లో దానిపై హైకోర్టును ఆశ్రయించారు. విజయ్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. జనవరి 2026లో తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఆ పిటిషన్ ను కొట్టివేస్తూ.. తీర్పు వెలువరించింది.

ఆ ఆర్థిక సంవత్సరంలో విజయ్ ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినపుడు రూ.35 కోట్లు ఆదాయాన్ని పొందినట్లు ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హైకోర్టులో నివేదిక దాఖలు చేసింది. దీని ఆధారంగా విజయ్ ఇంటిలో తనిఖీలు చేసిన అధికారులు.. పులి సినిమాకు తీసుకున్న రూ.15 కోట్ల ఆదాయాన్ని లెక్కల్లో చూపలేదని గుర్తించింది. దానికి రూ.1.50 కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ జరిమానాను విజయ్ హైకోర్టులో సవాల్ చేయగా.. దానిని కొట్టివేసింది.

Next Story