నగర ప్రజలకు బిగ్ షాక్.. పెరిగిన మెట్రో రైలు చార్జీలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-25 05:23:39  IST  )

ఢిల్లీ (Delhi)లోని బీజేపీ సర్కార్ (BJP Government) అక్కడి ప్రజలకు షాకిచ్చింది.

నగర ప్రజలకు బిగ్ షాక్.. పెరిగిన మెట్రో రైలు చార్జీలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi)లోని బీజేపీ సర్కార్ (BJP Government) అక్కడి ప్రజలకు షాకిచ్చింది. ఈ మేరకు 8 ఏళ్ల తరువాత మెట్రో రైలు చార్జీలను పెంచుతున్నట్లుగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) వెల్లడించింది. అయితే, చివరిసారిగా 2017లో మెట్రో రైలు చార్జీలను పెంచగా.. ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, పెంచిన మెట్రో రైలు చార్జీలు నేటి నుంచి అమల్లోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. సాధారణ రోజులు 2 కి.మీ ప్రయాణానికి రూ.10గా ఉన్న చార్జీని రూ.11 చేశారు. ఇక 12 నుంచి 21 కి.మీ రూ.40 ఉండగా.. రూ.43కు, 21 నుంచి 32 కి.మీ: రూ.50 ఉండగా రూ.54కు, 35 కి.మీ పైగా ప్రయాణానికి గతంలో రూ.60 ఉండగా.. రూ.64 పెంచారు. ఆదివారాలు, జాతీయ సెలవు దినాల్లో 12 నుంచి 21 కి.మీ ప్రయాణానికి గతంలో రూ.30 చార్జ్ చేస్తుండగా.. ప్రస్తుతం రూ.32కు పెంచారు. అదేవిధంగా 32 కి.మీ.కు పైగా ప్రయాణానికి గతంలో రూ.50 చార్జ్ చేస్తుండగా.. రూ.54కు పెంచారు. అదేవిధంగా ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ రూట్లో ధరలు రూ.5 వరకు పెరిగినట్లుగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్

Next Story