పాకిస్థాన్ కు బిగ్ షాక్.. 10 మంది సైనికులు మృతి !

by velandi.Saikiran |

జమ్మూ కాశ్మీర్ లోని ( Jammu and Kashmir ) పహాల్గమ్ (pahalgam terror attack ) కాల్పులు జరిపిన తర్వాత పాకిస్తాన్ ( Pakisth

పాకిస్థాన్ కు బిగ్ షాక్.. 10 మంది సైనికులు మృతి !
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్ లోని ( Jammu and Kashmir ) పహాల్గమ్ (pahalgam terror attack ) కాల్పులు జరిపిన తర్వాత పాకిస్తాన్ ( Pakisthan) దేశానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ ను ఎడారి చేసేందుకు మోడీ ప్రభుత్వం ( Modi government) నిర్ణయం తీసుకోగా... తాజాగా అక్కడి ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా పాకిస్తాన్ దేశానికి సంబంధించిన పది మంది సైనికులు ( Soldiers) ఒక్కసారిగా మరణించారు. ఇండియాతో యుద్ధం తప్పదన్నవేళ... పాకిస్తాన్ సైన్యంలో పది మంది మృతి చెందారు.

శుక్రవారం రోజున పాకిస్తాన్ దేశంలోని క్వెట్టాలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జరిపిన దాడుల్లో ఏకంగా 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. మార్కెట్ ఏరియాలో రోడ్డు పక్కన బాంబు పెట్టి... రిమోట్ కంట్రోల్ తో ఆ బాంబును పేల్ చేశారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సభ్యులు. ఇక ఆ దాడి వీడియోను విడుదల కూడా చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇది ఇలా ఉండగా మార్చి మాసంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జరిపిన దాడుల్లో పాకిస్తాన్ లో దాదాపు 60 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ( Baloch Liberation Army) మొదటి నుంచి పోరాడుతోంది. అందుకే.. కనీసం నెలకొకసారి అయినా పాకిస్తాన్ లో అరాచకానికి తెరలేపుతోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.

Next Story