- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు షాక్.. ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ప్రఖ్యాత సంగీత దర్శకుడు, మ్యూజిక్ మెస్ట్రో ఇళయరాజాకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రఖ్యాత సంగీత దర్శకుడు, మ్యూజిక్ మెస్ట్రో ఇళయరాజా (Ilayaraja)కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో షాక్ తగిలింది. ఈ మేరకు 536 సంగీత రచనలకు సంబంధించి కాపీరైట్ వివాదం కేసును బాంబే హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆయన ఇటీవలే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఇవాళ మరోసారి ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్.వి.అంజారియా ధర్మాసనం ఇళయరాజా పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పును వెలువరించింది.
అయితే 2022లో సోనీ మ్యూజిక్ ఎంటర్‌టైన్‌మెంట్, ఇళయరాజా మ్యూజిక్ ఎన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (IMMPL)కు సంబంధించి 536 రచనలను ఉపయోగించకుండా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అదేవిధంగా ఆ రచనలపై హక్కులతో పాటు ఓరియంటల్ రికార్డ్స్, ఎకో రికార్డింగ్ తమ పరిధిలో ఉన్నాయని సోనీ పేర్కొంది. అయితే, ఇళయరాజా మ్యూజిక్ ఎన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (IMMPL) కంపోజ్ చేసిన 536 రచనల్లో 310 రచనలకు సంబంధించి మద్రాస్ హైకోర్టులో కేసు సమాతరంగా నడుస్తుంది. దీంతో ఇళయరాజా కేసును బాంబే హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఇళయరాజా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌ను తాజాగా ధర్మాసనం డిస్మిస్ చేసింది.






