- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sidha Ramaiah : కర్ణాటక సీఎంకు భారీ షాక్.. జైలు తప్పదా?
by Muthe.Rajitha |
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Karnataka CM Sidha Ramaiah) కు భారీ షాక్ తగిలింది.

X
దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Karnataka CM Sidha Ramaiah) కు భారీ షాక్ తగిలింది. ముడా- మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(MUDA) భూముల స్కాం(MUDA Scam)లో ఆయన భార్యతోపాటు ఇతర కుటుంబ సభ్యులు ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ(ED) సిద్ద రామయ్య భార్య పార్వతికి, మంత్రి సురేష్ కు నోటీసులు జారీ చేసింది. ముడా భూముల కేటాయింపులో భారీగా మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలతో గత అక్టోబరులో హైకోర్ట్ అనుమతితో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కాగా ఈ కేసులో సిద్ద రామయ్య, ఆయన భార్యతోపాటు, ఆయన బావమరిది బీఎం మల్లిఖార్జున స్వామిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈడీ మరింత దర్యాప్తు వేగం పెంచి, కేసును ఓ కొలిక్కి తెచ్చే పనిలో ఉంది. ఈ కేసులో వీరంతా నిందితులుగా తేలితే.. వీరికి జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Next Story






