- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారతీయులకు బిగ్ షాక్.. H-1B, H-4 వీసాలు ముందస్తుగా రద్దు
యూఎస్ (US) స్టేట్ డిపార్ట్‌మెంట్ నేటి నుంచి విదేశీయుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను తనిఖీ చేయనుంది.

దిశ, వెబ్‌డెస్క్: యూఎస్ (US) స్టేట్ డిపార్ట్‌మెంట్ నేటి నుంచి విదేశీయుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను తనిఖీ చేయనుంది. అందరూ సోషల్ మీడియా (Social Media) అకౌంట్లను 'పబ్లిక్' సెట్టింగ్‌కు మార్చాలని మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురి H-1B, H-4 వీసాలను ముందస్తుగా రద్దు చేశారు. ఈ మేరకు పలువురికి యూఎస్ కాన్సులేట్ల నుంచి ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందింది. అయితే, ఇది జాగ్రత్త కోసం తీసుకున్న తాత్కాలిక చర్య మాత్రమేనని, శాశ్వత రద్దు కాదని ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు.
కాగా, వీసాల రద్దు అమెరికాలో చట్టబద్ధంగా ఉండే స్టేటస్‌ను ప్రభావితం చేయదని అన్నారు. అయితే, దేశం విడిచి మళ్లీ యూఎస్‌కు వచ్చేటప్పుడు కొత్త వీసా స్టాంప్ అవసరం అవుతుందని స్పష్టం చేశారు. గతంలో పోలీసులతో ఏదైనా సంబంధం ఉన్నవారి వీసాలు పూర్తిగా రద్దు అవుతాయని పేర్కొన్నారు. తాజా పరిణామాలు, మార్పులు అమెరికాలో ఉన్న భారతీయ టెక్ నిపుణుల (Indian Tech Professionals)పై ఎక్కువ ప్రభావం చూపనున్నాయి. ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు దరఖాస్తుదారులు తమ ఆన్‌లైన్ ప్రొఫైల్స్‌ను జాగ్రత్తగా సమీక్షించుకోవాలని సూచిస్తున్నారు. ఈ నియమాలు జాతీయ భద్రత కోసమేనని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.






