Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకి మరో బిగ్ షాక్..!

by Ramesh Naini |   (  Updated:2025-09-02 16:40:53  IST  )

ప్రముఖ కన్నడ నటి రన్యారావుకి మరో బిగ్ షాక్ తగిలినట్టైంది.

Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకి మరో బిగ్ షాక్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ కన్నడ నటి రన్యారావు (Ranya Rao)కు మరో బిగ్ షాక్ తగిలినట్టైంది. (gold smuggling case) గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. తాాజాగా ఆమెకు డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) భారీగా జరిమానా విధించింది. రూ.102.55 కోట్లకు పైగా జరిమానా విధిస్తూ డీఆర్ఐ నోటీసులు పంపింది. నటి రన్యారావుతో పాటు మొత్తం నలుగురు నిందితులపై రూ.270 కోట్ల పెనాల్టీ విధించింది. జరిమానా చెల్లించకపోతే ఆస్తుల జప్తు ఉంటుందని వారికి నోటీసుల్లో హెచ్చరించింది.

నిందితులు ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. జైల్లోనే డీఆర్ఐ అధికారులు వారికి నోటీసులు అందజేశారు. దాదాపు 2500 పేజీలతో కూడిన పెనాల్టీ నోటీసులు ఇచ్చినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కాగా, బంగారం అక్రమంగా తరలిస్తూ నటి రన్యారావు పట్టుబడిన విషయం తెలిసిందే. మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 14.8 కిలోల బంగారంతో ఆమె పట్టుబడ్డారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు తెలుసుకున్నారు. 2023 నుంచి 2025 మధ్య కాలంలో ఆమె ఏకంగా 52 సార్లు దుబాయ్ ట్రిప్ వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఆమె ఇంట్లో అధికారులు తనిఖీలు చేసి.. భారీగా డబ్బులు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

Next Story