Yediyurappa : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రికి బిగ్ రిలీఫ్

by Shamantha N |

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు (BS Yediyurappa) ఊరట దక్కింది. పోక్సో కేసులో ఆయనకు కోర్టు స్వల్ప ఊరట కల్పించింది.

Yediyurappa : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రికి బిగ్ రిలీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు (BS Yediyurappa) ఊరట దక్కింది. పోక్సో కేసులో ఆయనకు కోర్టు స్వల్ప ఊరట కల్పించింది. మార్చి 15న పోక్సో (Pocso) కేసు విచారణకు హాజరుకావాలని ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు ఇటీవలే ఆయనను ఆదేశించింది. అయితే, కర్ణాటక హైకోర్టు ఆ కేసుకు సంబంధించిన సమన్లను నిలిపివేసింది. 17 ఏళ్ల బాలికపై యడియూరప్ప (EX CM Yediyurappa) లైంగిక దాడికి పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. మైనర్‌ అయిన తన కూతురుపై గతేడాది ఫిబ్రవరి 2న యడియూరప్ప లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని బాలిక తల్లి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయం కోసం కూతురుతో కలిసి వెళ్లానని, యడియూరప్ప తమతో 9 నిమిషాలపాటు మాట్లాడారని, ఆ తర్వాత బాలికను గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. గది నుంచి బయటకు వచ్చిన యడియూరప్ప క్షమాపణలు చెప్పారని, ఎవరికీ చెప్పవద్దని భయపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం 8, ఐపీసీ సెక్షన్‌ 354(ఎ) కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను యడియూరప్ప కార్యాలయం ఖండించింది. ఫిర్యాదుదారు గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేశారని పేర్కొంది.

Next Story