- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియన్స్‌కు బిగ్ రిలీఫ్.. వీసా ఫీజు పెంపుపై వైట్ హౌస్ కీలక ప్రకటన
హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించినప్పటి నుంచి టెక్ కంపెనీల్లో, అమెరికా నుంచి స్వదేశాలకు వెళ్లినవారిలో ఆందోళన నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్ : హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించినప్పటి నుంచి టెక్ కంపెనీల్లో, అమెరికా నుంచి స్వదేశాలకు వెళ్లినవారిలో ఆందోళన నెలకొంది. ట్రంప్ పేల్చిన బాంబుతో.. అమెరికాలో ఉన్న టెక్ కంపెనీలన్నీ విదేశాల్లో ఉన్న తమ ఉద్యోగులు 24 గంటల్లో రిటర్న్ రావాలని పేర్కొంటూ మెయిల్స్ పంపాయి. దీంతో ఇండియన్స్ తో సహా ఆయా దేశాల్లో ఉన్న ఉద్యోగులు.. ఎయిర్ పోర్టులకు క్యూ కట్టారు. హెచ్1బీ వీసా ఫీజు పెంపుపై ఉద్యోగులు, టెక్ కంపెనీల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న వేళ వైట్ హౌస్ కీలక ప్రకటన విడుదల చేసింది. వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) ఎక్స్ (X)లో లక్షడాలర్ల ఫీజుపై క్లారిటీ ఇస్తూ ఒక పోస్ట్ చేశారు.
ఉద్యోగార్థులకు ఇచ్చే హెచ్1బీ వీసాపై విధించిన లక్షడాలర్ల ఫీజు ఏడాదికి కాదని, ఇది వన్టైమ్ పేమెంట్ అని స్పష్టం చేశారు. అంటే అప్లై చేసుకునేటపుడు లక్షడాలర్లు చెల్లిస్తే చాలన్నారు. ఇప్పటికే హెచ్1బీ వీసా ఉండి.. అమెరికా బయట ఉన్నవారు ఈ ఫీజుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎప్పటిలాగే అమెరికాకు తిరిగిరావొచ్చునని, ఎలాంటి ఫీజు ఉండదని తెలిపారు. కొత్తగా హెచ్1బీ వీసాకు అప్లై చేసుకునేవారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని, రెన్యూవల్స్ కు కూడా ఈ ఫీజు వర్తించదని స్పష్టం చేశారు. కరోలిన్ ప్రకటనతో ఇండియన్స్ కు బిగ్ రిలీఫ్ లభించింది. తిరిగి అమెరికాకు వెళ్లాలంటే లక్ష డాలర్లు చెల్లించాలని ఉద్యోగులు, టెక్ కంపెనీలు ఆందోళన చెందుతున్న సమయంలో ఈ ప్రకటన భారీ ఊరటనిచ్చింది. అలాగే ఎఫ్-1 స్టూడెంట్ వీసా కలిగి ఉన్నవారు కూడా హెచ్1బీ వీసాకు లక్షడాలర్లు చెల్లించాల్సి అవసరం లేదన్నారు.






