- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ జర్నీ.. బట్టలు లేకుండా పూర్తి నగ్నంగా 11 రోజులు ప్రయాణించిన ప్రజలు.. కారణం ఇదే
నగ్నంగా సముద్ర ప్రయాణం ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? బట్టలు విప్పేసి మీకు నచ్చిన విధంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకు బెస్ట్ ఆప్షన్ ఈ బిగ్ న్యూడ్ బోట్. దాదాపు 11 రోజులు

దిశ, వెబ్‌డెస్క్: నగ్నంగా సముద్ర ప్రయాణం ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? బట్టలు విప్పేసి మీకు నచ్చిన విధంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకు బెస్ట్ ఆప్షన్ ఈ బిగ్ న్యూడ్ బోట్. దాదాపు 11 రోజులు ఈ నార్వేజియన్ పెర్ల్ షిప్‌పై హాయిగా బట్టలు లేకుండా జర్నీ చేయొచ్చు. బేర్ నెసెసిటీస్ అందించే ఈ సాహసోపేత యాత్ర శరీరాన్ని బహిర్గతం చేసే అవకాశం ఇవ్వడమే కాదు స్వేచ్ఛ, శరీర సానుకూలత, ఒత్తిడి-రహిత వాతావరణాన్ని అందిస్తుంది. సురక్షిత, గౌరవపూర్వక స్థలాన్ని అందిస్తుంది. బహామాస్‌లో సన్ బాత్ నుంచి సెయింట్ లూసియాలో డ్యాన్స్ వరకు... ఈ యాత్ర చాలా స్పెషల్‌గా రూపొందించబడింది.
ఇక ఇప్పటికే ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఓ ట్రిప్ ముగియగా.. నేచురిస్టులకు దుస్తులు లేని సురక్షిత స్థలాన్ని అందించింది. 2,300 మంది ప్రయాణీకుల సామర్థ్యం కలిగిన నార్వేజియన్ పెర్ల్... 16 డైనింగ్ ఆప్షన్లు, 14 బార్‌లు, స్పా, కాసినో, ఓపెన్ డెక్ స్పేస్‌లతో సహా బఫే ప్రాంతం కలిగి ఉంది. అయితే డైనింగ్ రూమ్, పోర్ట్‌లో ఉన్నప్పుడు, కెప్టెన్ రిసెప్షన్ సమయంలో దుస్తులు తప్పనిసరి. కాగా అనుచిత ప్రవర్తన, లింగరీ, ఫెటిష్ క్లాత్స్, అనుమతి లేని ఫోటోగ్రఫీ నిషేధం.






