BIG BREAKING : శివసేన చీఫ్ ఏక్‌నాథే.. 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు చెల్లదన్న స్పీకర్

by Disha Web Desk 1 |
BIG BREAKING : శివసేన చీఫ్ ఏక్‌నాథే.. 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు చెల్లదన్న స్పీకర్
X

దిశ, వెబ్‌డెస్క్ : మహరాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు చెల్లదని స్పీకర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన కేసులో అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఇవాళ తన తీర్పును వెలువరించారు. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీ సమావేశమైంది. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ రాహుల్ నార్వేకర్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి తన తీర్పును వెల్లడిస్తున్నాని పేర్కొన్నారు. షిండే వర్గానికి మెజారిటీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని స్పీకర్ తెలిపారు. దీంతో ఉద్దవ్ అభ్యర్థనను ఆయన తోసిపుచ్చి, షిండే గ్రూప్ అసలైన శివసేన అని తీర్పును వెల్లడించారు. అదేవిధంగా ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి కొనసాగే అధికారం ఉందని తెలిపారు.

కాగా, జూన్ 2022లో, ఏక్‌నాథ్ షిండే, పలువురు ఎమ్మెల్యేలు అప్పటి సీఎం ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేశారు. దీంతో శివసేన పార్టీలో చీలిక ఏర్పడింది. ఈ క్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), కాంగ్రెస్‌ ఒక్కడవ్వడం వల్ల పాలక మహా వికాస్ అఘాడి ప్రభుత్వం పతనానికి దారి తీసింది. అనంతరం ఏక్‌నాథ్ షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి విడిపోయిన వర్గంతో ఆయన చేతులు కలిపాడు.


Next Story

Most Viewed