- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. రైల్వేలో 22 వేల గ్రూప్-డి ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు రైల్వే శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు రైల్వే శాఖ (Department of Railways) బిగ్ అలర్ట్ ఇచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న సుమారు 22,000 గ్రూప్-డి పోస్టుల భర్తీకి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ (Short notification)ను విడుదల చేసింది. ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ట్రాఫిక్ విభాగాల్లో ఈ భారీ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. 2026 జనవరి 21 నుండి ఫిబ్రవరి 20 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కానుండటంతో అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు, కేంద్ర బలగాల్లో ఖాళీగా ఉన్న 25,487 పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. ఒకేసారి రైల్వే, కేంద్ర బలగాల నుండి భారీ సంఖ్యలో ఉద్యోగ ప్రకటనలు రావడంతో నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశం గా మారనుంది. సొంత రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో పని చేయాలనుకునే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- Tags
- Group-D jobs
- RRB






