- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. ITR ఫైలింగ్‌పై కేంద్రం కీలక ప్రకటన
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పెనాలిటీలు లేకుండా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు నేటితో గడువు ముగియనుంది.

దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పెనాలిటీలు లేకుండా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు నేటితో గడువు ముగియనుంది. అయితే, గడువును మరోసారి పొడిగించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ కీలక ప్రకటన చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలుకు చేసేందుకు గడవు పొడిగించలేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. ‘ఐటీఆర్ (IT Returns) ఫైలింగ్ గడువును ఇప్పటికే జులై 31 నుంచి సెప్టెంబరు 15 వరకు పొడిగించాం.
కానీ, ఆ తేదీని సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఐటీఆర్ దాఖలుకు సెప్టెంబరు 15 చివరి తేదీ. ఫేక్ న్యూస్‌ను నమ్మకండి. ఆదాయపు పన్ను (Income Tax) విభాగం అధికారికంగా ఇచ్చే అప్‌డేట్లను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి. ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing), పన్ను చెల్లింపులపై సందేహాలను నివృత్తి చేసేందుకు రౌండ్ ది క్లాక్ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశామంటూ ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ ‘X’ వేదికగా ట్వీట్ చేసింది. స్పష్టం చేసింది.






