- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి అమల్లోకి పెంచిన రైలు ఛార్జీలు
దేశ శ్యాప్తంగా రైలు ఛార్జీలు (Charges) పెంచుతూ ఇండియన్ రైల్వేస్ (Indian Railways) ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: దేశ శ్యాప్తంగా రైలు ఛార్జీలు (Charges) పెంచుతూ ఇండియన్ రైల్వేస్ (Indian Railways) ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి నుంచి పెంచిన రైలు ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ ఛార్జీల పెంపును రైల్వే అధికారులు నోటిఫై చేయగా.. 215 కి.మీ., దాటిన ప్రయాణానికి జనరల్ విభాగంలో ప్రతి కిలో మీటరుకు 1 పైసా చొప్పున, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ, ఏసీ తరగతుల్లో ప్రతి కిలో మీటరుకు 2 పైసల చొప్పున ఛార్జీలు పెరిగాయి. తాజా ఛార్జీల పెంపుతో ఇదే సంవత్సరంలో రైల్వేశాఖ రెండుసార్లు ఛార్జీలను పెంచినట్లయింది. సబర్బన్ సర్వీసులు, సీజనల్ టికెట్ల ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవని అధికారులు వెల్లడించారు.
ఇక తేజస్ రాజధాని, రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, హమ్‌సఫర్, అమృత్ భారత్, తేజస్, మహామాన, గతిమాన్, అంత్యోదయ, గరీబ్ రథ్, జన శతాబ్ది, యువ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ ర్యాపిడ్ రైల్, సాధారణ యాప్/సబురబుల్ యాప్, ఎంయూడీఈయూఎం (MUDEUM)తో సహా ప్రధాన రైలు సర్వీసుల ప్రాథమిక ఛార్జీలు పెరుగుతాయని అధికారిక రైల్వే శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొంది.






