- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెటిజన్లకు బిగ్ అలర్ట్.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రకటించిన స్టార్‌లింక్
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) సంస్థ యాజమాన్యంలోని స్టార్‌లింక్ సాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారత్‌లో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) సంస్థ యాజమాన్యంలోని స్టార్‌లింక్ సాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారత్‌లో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే స్టార్‌లింక్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో రెసిడెన్షియల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ వివరాలను ప్రకటించారు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ కనీస ధర ₹8,600గా ప్రకటించారు. ఇందులో అన్‌లిమిటెడ్ హై-స్పీడ్ డేటాను ఇవ్వనున్నారు. వన్ టైమ్ హార్డ్‌వేర్ కిట్ ధర ₹34 వేలుగా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో సాటిలైట్ డిష్, వై-ఫై రౌటర్, మౌంటింగ్ స్టాండ్, కేబుల్స్, పవర్ అడాప్టర్‌తో కూడిన ప్లగ్-అండ్-ప్లే కిట్ వినియోగదారులకు ఇవ్వనున్నారు.
కాగా, ఇక స్పీడ్, పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. లొకేషన్ ఆధారంగా డౌన్‌లోడ్ స్పీడ్ 25 నుంచి 220 Mbps వరకు ఉంటుంది. అప్‌లోడ్ స్పీడ్ 5 నుంచి 20 Mbps ఉంటుంది. 99.99 శాతం పైగా నెట్‌వర్క్ అప్‌టైమ్‌తో ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా నిర్విరామంగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయని స్టార్‌లింక్ ప్రతినిధులు తెలిపారు. స్టార్‌లింక్ ఇండియా వెబ్‌సైట్‌లో ఇప్పటికే ప్రీ-ఆర్డర్ ఆప్షన్ యాక్టివ్ అయింది. మరిన్ని వివరాలకు https://www.starlink.com/in వెబ్‌సైట్‌ను సందర్శించండి. గ్రామీణ, అటవీ, పర్వత ప్రాంతాలతో పాటు నగరాల్లోని రిమోట్ లొకేషన్లలో కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించే లక్ష్యంతో స్టార్‌లింక్ సేవలు ప్రారంభం కానున్నాయి.






