వైద్య విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వారం రోజుల్లో NEET (UG) రీ-ఎగ్జామ్‌ షెడ్యూల్!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-15 08:29:12  IST  )

నీట్‌ (యూజీ) రీ-ఎగ్జామ్ నిర్వహణకు కేంద్ర విద్యాశాఖ ఏర్పాట్లను శరవేగంగా చేస్తున్నది.

వైద్య విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వారం రోజుల్లో NEET (UG) రీ-ఎగ్జామ్‌ షెడ్యూల్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌-యూజీ (NEET-UG) పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు కేంద్ర విద్యాశాఖ తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. పరీక్షా నిర్వహణలో ఎదురైన అవకతవకలు, వివాదాల నేపథ్యంలో పారదర్శకతను కాపాడేందుకు కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, నీట్‌ పున:పరీక్ష నిర్వహణకు అవసరమైన సన్నాహాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన నివాసంలో ఉన్నతాధికారులతో ఇప్పటికే పలు దఫాలుగా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్, సీబీఎస్‌ఈ (CBSE) ఛైర్మన్‌తో పాటు పలువురు కీలక అధికారులు పాల్గొన్నారు.

పకడ్బందీగా పరీక్ష నిర్వహణే లక్ష్యం..

అయితే, గతంలో ఎదురైన లోపాలు పునరావృతం కాకుండా, పరీక్షను అత్యంత కట్టుదిట్టంగా ఎలా నిర్వహించాలనే అంశంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పేపర్ లీక్‌లు, సాంకేతిక ఇబ్బందులకు తావు లేకుండా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులు నిర్ణయించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశం కావడంతో, ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఉండకూడదని మంత్రి అధికారులను ఆదేశించారు. నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించి పూర్తి వివరాలు, షెడ్యూల్‌ను వారం, పది రోజుల్లోపు అధికారికంగా ప్రకటిస్తామని ఎన్‌టీఏ (NTA) డీజీ వెల్లడించారు. కేంద్రం తాజా ప్రకటనతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లైంది.

జూన్ 21న NEET (UG) రీ-ఎగ్జామ్.. అధికారికంగా ప్రకటించిన NTA

Next Story