విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. కఠిన నిబంధనలను ప్రతిపాదించిన DGCA

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-19 02:09:18  IST  )

విమానాల్లో అసభ్యంగా ప్రవర్తించే ప్రయాణికులపై DGCA 'జీరో టాలరెన్స్' విధానంతో కఠిన నిబంధనలను ప్రతిపాదించింది.

విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. కఠిన నిబంధనలను ప్రతిపాదించిన DGCA
X

దిశ, వెబ్‌డెస్క్: విమానాల్లో తోటి ప్రయాణీకులతో లేదా సిబ్బందితో అసభ్యంగా, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించే వారిపై (Unruly Flyers) కఠిన చర్యలు తీసుకునేందుకు పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) కొత్త ముసాయిదా నిబంధనలను సిద్ధం చేసింది. విమాన ప్రయాణంలో భద్రత, క్రమశిక్షణను కాపాడటమే లక్ష్యంగా ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రయాణీకుల ప్రవర్తనను కేవలం విమానంలోనే కాకుండా చెక్-ఇన్ కౌంటర్లు, లాంజ్‌లు, బోర్డింగ్ గేట్ల వద్ద కూడా పర్యవేక్షించాలని ఎయిర్‌లైన్స్‌ను DGCA ఆదేశించింది. ఎవరైనా అక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తే వారిని విమానం ఎక్కకుండా నిరోధించే అధికారం ఉంటుంది. జాతీయ భద్రతకు ముప్పుగా భావించే వ్యక్తుల జాబితాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ DGCA, ఎయిర్‌లైన్స్‌కు అందజేస్తుంది. అలాంటి వారిని నేరుగా ‘నో-ఫ్లై లిస్ట్’లో చేర్చి విమాన ప్రయాణాల నుంచి నిషేధించనున్నారు.

నాలుగు లెవల్స్‌గా విభజన..

ప్రయాణీకుల ప్రవర్తనను తీవ్రతను బట్టి నాలుగు స్థాయిలుగా విభజించారు. లెవల్ 1లో భాగంగా మాటలతో దూషించడం, అసభ్య హావభావాలు ప్రదర్శించడం నేరం. విమానంలో శారీరక, లైంగిక దాడి, లెవల్ 3లో ప్రాణాపాయం కలిగించే చర్యలు, లెవల్ 4లో ఫ్లైట్ క్రూ కాక్‌పిట్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడం లాంటి తీవ్రమైన నేరాలుగా పరిగణించి శిక్ష విధించనున్నారు. అయితే, గతంలో స్వతంత్ర దర్యాప్తు కమిటీ నిర్ధారిస్తేనే శిక్ష పడేది. డీజీసీఏ తాజా నిర్ణయం మేరకు అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులను ఎయిర్‌లైన్స్ సంస్థలు నేరుగా శిక్షించే అవకాశం ఇచ్చారు.

అదేవిధంగా ప్రయాణీకుల అసహనాన్ని ముందుగానే గుర్తించి, పరిస్థితి తీవ్రతరం కాకుండా చూడాలని ఎయిర్‌లైన్స్ సిబ్బందికి డీజీసీఏ గుర్తించింది. అదే సమయంలో సిబ్బంది కూడా ప్రయాణీకులతో మర్యాదగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు కేవలం భారతీయ విమాన సంస్థలకే కాకుండా భారతదేశం నుంచి లేదా భారతదేశానికి నడిచే విదేశీ విమాన సంస్థలకు కూడా వర్తించనున్నాయి. ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎయిర్‌లైన్స్ ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని DGCA చీఫ్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ పేర్కొన్నారు.

Next Story