- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చివరి గంటల్లో బైడెన్ సంచలన నిర్ణయం
వీరిద్దరూ గతంలో ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించారు. కాగా, రెండో సారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరిపై రాజకీయ ప్రేరేపిత విచారణ జరుపుతారేమోననే అనుమానంతో, వారికి న్యాయపరమైన రక్షణ లభించేలా బైడెన్ వారికి ముందస్తు క్షమాభిక్ష ప్రసాదించారు.

- డాక్టర్ ఆంటోనీ ఫౌసీ, మార్క్ మిల్లేలకు ముందస్తు క్షమాభిక్ష
- క్యాపిటల్ హిల్ దాడుల విచారణ కమిటీ సభ్యులకు కూడా
- ట్రంప్ బారి నుంచి కాపాడేందుకేనా?
దిశ, నేషనల్ బ్యూరో:
అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోతున్న కొన్ని గంటల ముందు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్-19 సలహాదారుగా పనిచేసిన డాక్టర్ ఆంటొనీ ఫౌసీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లేలకు ముందస్తు క్షమాభిక్షను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరూ గతంలో ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించారు. కాగా, రెండో సారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరిపై రాజకీయ ప్రేరేపిత విచారణ జరుపుతారేమోననే అనుమానంతో, వారికి న్యాయపరమైన రక్షణ లభించేలా బైడెన్ వారికి ముందస్తు క్షమాభిక్ష ప్రసాదించారు. ఇక 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్ మీద దాడి చేసిన కేసును విచారించిన హౌస్ కమిటీ సభ్యులకు కూడా ఉపశమనం కలిగించారు. క్యాపిటల్ మీద దాడి, అల్లర్లకు తానే జవాబుదారినని పేర్కొన్న వారిపై తగిన చర్యలు తీసుకుంటానని గతంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే బైడెన్ ముందస్తు క్షమాభిక్ష నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 'ప్రజలకు సేవ చేసిన వారికి మన దేశం ఎంతగానే రుణపడి ఉంటుంది. వారి నిబద్దతకు తగిన కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నాను' అని బైడెన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులతో డాక్టర్ ఆంటోనీ ఫౌసీ, మాజీ జనరల్ మార్క్ మిల్లే, హౌస్ కమిటీ విచారణ సభ్యులతో పాటు.. అదే కమిటీలో ఉన్న రిపబ్లికన్ పార్టీ సభ్యులు లిజ్ చెనే, అడమ్ కింజింగర్‌లకు కూడా ముందస్తు క్షమాభిక్ష లభించనుంది.






