- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Biden: కార్యాలయాన్ని మాత్రమే వీడాం.. పోరాటాన్ని కాదు..
‘కార్యాలయాన్ని మాత్రమే వీడాం.. పోరాటాన్ని కాదు’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి బాధ్యతల నుంచి జో బైడెన్ (Joe Biden) వైదొలిగిన తర్వాత ఈ కామెంట్స్ చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ‘కార్యాలయాన్ని మాత్రమే వీడాం.. పోరాటాన్ని కాదు’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి బాధ్యతల నుంచి జో బైడెన్ (Joe Biden) వైదొలిగిన తర్వాత ఈ కామెంట్స్ చేశారు. అంతేకాక.. ‘ఈరోజు స్పీచ్ విన్నాం.. మనం ఇంకా చేయాల్సింది చాలా ఉంది’ అని పేర్కొన్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలగబోనని, ప్రజా జీవితంలో కొనసాగుతానని జో బైడెన్ గతంలో స్పష్టంచేశారు. సాధారణంగా అమెరికా అధ్యక్షులుగా పని చేసినవారు పదవి నుంచి వైదొలగగానే ప్రజా జీవితానికి దూరంగా ఉంటారు. కానీ బైడెన్ తాను అలా చేయనని పేర్కొనడం గమనార్హం. ఇక, అమెరికాకు 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణస్వీకారానికి ముందు.. జో బైడెన్ దంపతులు, ట్రంప్ దంపతులకు సంప్రదాయం ప్రకారం టీపార్టీ ఇచ్చారు. బైడెన్ ‘వెల్‌కమ్ హోం’ అంటూ ట్రంప్‌నకు స్వాగతం పలికారు. అయితే, ఈసందర్భంగా ట్రంప్‌నకు సంప్రదాయబద్ధంగా లేఖ రాశారా అని మీడియా ప్రశ్నించగా.. అవునని బైడెన్ బదులిచ్చారు. కాగా.. లేఖలో ఏం ఉందనేది మాత్రం సీక్రెట్ గానే మిగిలిపోయింది. అందులో ఏముందో బైడెన్ చెప్పలేదు. ట్రంప్ బాధ్యతల స్వీకరణ తర్వాత బైడెన్ హెలికాప్టర్ లో కాలిఫోర్నియాకు వెళ్లిపోయారు.
చివరి నిమిషంలోనూ..
అమెరికా అధ్యక్షుడిగా తన చివరి క్షణంలో బైడెన్ అసాధారణ అధికారాలను వాడుకున్నారు. తన బంధువులు, వారి జీవిత భాగస్వాములకు చట్టపరమైన రక్షణ కల్పించే ఉత్తర్వులు జారీ చేశఆరు. తనను బాధించే ఉద్దేశంతో వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని, అవి ఇప్పట్లో ముగియవని ఆయన పేర్కొనటం గమనార్హం. ట్రంప్ హయాంలో ఎవరిపైన ప్రతీకార చర్యలు దిగే అవకాశం ఉందో వారందరికీ చట్టపరమైన రక్షణ కల్పిస్తూ బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. క్షమాభిక్ష, చట్టపరమైరక్షణలు కల్పిస్తుండటంతో బైడెన్ పై విమర్శలు వస్తున్నా ఆయన వెనక్కి తగ్గట్లేదు. తాను రక్షణ, క్షమాభిక్ష కల్పిస్తున్నవారంతా ఏదో తప్పులు చేసినట్లో, వాటిని అంగీకరించినట్లో కాదని బైడెన్ స్పష్టంచేస్తున్నారు. ఇక,చివరి క్షణంలో డాక్టర్ ఆంథోనీ ఫౌసీ, విశ్రాంత జనరల్ మార్క్ మిలే, క్యాపిటల్ భవంతిపై 2021 జనవరి 6న జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపిన కమిటీ సభ్యులకు బైడెన్ రక్షణ కల్పించారు. 2020 ఎన్నికల్లో తన ఓటమికి కారకులైనవారిని, క్యాపిటల్ భవంతిపై దాడిలో తన పాత్ర ఉందన్న వారి అంతు చూస్తానని ట్రంప్ గతంలో హెచ్చరించారు. దీంతో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫౌసీ దాదాపు 40 ఏళ్లుగా అమెరికా ‘జాతీయ అలెర్జీ, అంటువ్యాధుల సంస్థ’కు డైరెక్టర్‌గా సేవలందించారు. బైడెన్‌కు ప్రధాన వైద్య సలహాదారునిగానూ ఉన్నారు. కరోనాపై ఫౌసీ చేసిన వ్యాఖఅయలపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. మరో వ్యక్తి మిలే అమెరికాలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌కు విశ్రాంత ఛైర్మన్. గతంలో ఆయన ట్రంప్‌ను ఫాసిస్టుగా అభివర్ణించారు.






