Jeo Biden : అధ్యక్ష పదవికి బై బై చెప్పిన బైడెన్.. కాసేపట్లో ట్రంప్ ప్రమాణ స్వీకారం

by Muthe.Rajitha |

అధ్యక్ష పదవికి జో బైడెన్(Jeo Biden) కాసేపటికి క్రితం వీడ్కోలు పలికారు.

Jeo Biden : అధ్యక్ష పదవికి బై బై చెప్పిన బైడెన్.. కాసేపట్లో ట్రంప్ ప్రమాణ స్వీకారం
X

దిశ, వెబ్ డెస్క్ : అధ్యక్ష పదవికి జో బైడెన్(Jeo Biden) కాసేపటికి క్రితం వీడ్కోలు పలికారు. అదేవిధంగా ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్(Kamala Harris) కూడ గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా బైడెన్.. "అమెరికా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉంది" అంటూ ఓ పోస్ట్ పెట్టారు. కాగా మరికొద్దిసేపట్లో అమెరికా నూతన అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్(Donald Trump) బాధ్యతలు చేపట్టనున్నారు. తన భార్య మెలనియా(Melania)తో కలిసి ట్రంప్ వైట్ హౌస్(White House) కు రాగా.. బైడెన్ దంపతులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వీరంతా కలిసి మర్యాదపూర్వక తేనీటి విందులో పాల్గొన్నారు. ఇక అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10.౩౦ గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Next Story