- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పక్షపాత నాయకులే సామాజిక న్యాయానికి అడ్డు: సోనియా గాంధీ
by Phanindra |
పక్షపాత నాయకులే సామాజిక న్యాయానికి అడ్డు అని సోనియా గాంధీ అన్నారు. హర్యానా ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై ఆమె ఇలా స్పందించారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ భార్య అమ్నీత్ కౌర్‌కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ లేఖ రాశారు. పూరన్ కుమార్ తన సూసైడ్ నోట్‌లో 16 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వల్లనే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశారు. దీనిపై స్పందించిన సోనియా.. పక్షపాత నాయకులు అధికారంలో ఉంటే అత్యున్నత పదవిలో ఉన్నా వివక్ష తప్పదని చెప్పేందుకు ఇదే నిదర్శనమని అన్నారు. ఇలాంటి ప్రవర్తన వల్లనే సామాజిక న్యాయం అందరికీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్న సోనియా గాంధీ.. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. న్యాయం కోసం నడిచే ఈ మార్గంలో అమ్నీత్‌కు తనతోపాటు లక్షలాది మంది ప్రజలు మద్దతుగా ఉన్నారని పేర్కొన్నారు.
Next Story






