భారత్‌ ఫోర్‌కాస్ట్‌ సిస్టం ప్రారంభం.. జాతికి అంకితం చేసిన కేంద్రమంత్రి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-26 11:18:37  IST  )

వాతావరణ ముందస్తు సమాచారం మరింత ముందుగా తెలుసుకునేలా మరో వ్యవస్థను పరిశోధకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత ఫోర్ కాస్ట్ సిస్టమ్ (Bharat Forecast System)ను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ (Jithendra Singh)జాతికి అంకితం చేశారు.

భారత్‌ ఫోర్‌కాస్ట్‌ సిస్టం ప్రారంభం.. జాతికి అంకితం చేసిన కేంద్రమంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: వాతావరణ ముందస్తు సమాచారం మరింత ముందుగా తెలుసుకునేలా మరో వ్యవస్థను పరిశోధకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత ఫోర్ కాస్ట్ సిస్టమ్ (Bharat Forecast System)ను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ (Jithendra Singh)జాతికి అంకితం చేశారు. గతంలో ఉన్న వ్యవస్థతో 6 కిలోమీటర్ల దూరంలో సమాచారం తెలుసుకోగలిగే వారమని, ఇప్పుడు 12 కిలోమీటర్ల ముందుగానే సమాచారం తెలుసుకోవచ్చని ఐఎండీ (IMD) పేర్కొంది. ఐదురోజులు ముందుగానే వాతావరణాన్ని అంచనా వేయవచ్చని, కొత్త గ్లోబల్ న్యూమరికల్ మోడల్ ఫోర్ కాస్ట్ సిస్టమ్ అతివృష్టిని అంచనా వేయడంలో సహాయపడుతుంది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ సిస్టమ్ ను ఐదుగురు మహిళా శాస్త్రవేత్తలు రూపొందించారని పేర్కొన్నారు.

భారత ఫోర్ కాస్ట్ సిస్టమ్ ద్వారా విపత్తుల వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. వ్యవసాయం, నీటి వనరుల నిర్వహణ, ప్రజా భద్రత కోసం పంచాయతీ స్థాయి వరకూ కచ్చితమైన వాతావరణ సూచనలను తెలుసుకోవచ్చని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. డాప్లర్ రాడార్ల సంఖ్య 100కి పెరుగుతుందని అంచనా వేశారు.

ఈ వ్యవస్థ 30 డిగ్రీల దక్షిణ, 30 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉష్ణమండల ప్రాంతానికి అధిక రిజల్యూషన్ సూచనలను అందిస్తుంది. ఇందులో భారత ప్రధాన భూభాగం 8.4 డిగ్రీల నుంచి 37.6 డిగ్రీల ఉత్తరం వరకు విస్తరించి ఉంటుంది. యూరోపియన్, బ్రిటిష్, యూఎస్ వాతావరణ కార్యాలయాలు నిర్వహించే ప్రపంచ సూచన నమూనాలు 9 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకూ రిజల్యూషన్ తో పనిచేస్తాయన్నారు. పుణెకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) ఈ వ్యవస్థను అభివృద్ధి చేసిందన్నారు.

Next Story