- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Donald Trump: ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపిన భారత్, ఇజ్రాయెల్ ప్రధానులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకోనున్న ట్రంప్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో (America President Election Results) డొనాల్డ్ ట్రంప్ హవా కొనసాగుతోంది. గెలుపుకు అతి దగ్గరలో ఉన్న ట్రంప్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi), ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Benjamin Netanyahu)ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇకపై భారత్ - అమెరికా (Bharat - America) ప్రజల కోసం కలిసి పనిచేద్దామని, ప్రపంచ శాంతి, సుస్థిరత్వం, శ్రేయస్సు కోసం కృషి చేద్దామని మోదీ పిలుపునిచ్చారు.
మీరు వైట్ హౌస్ (White House) లోకి తిరిగిరావడం ఒక కొత్త అధ్యయనానికి నాంది అని పేర్కొన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం దిశగా దూసుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ - మెలానియా కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ హయాంలో అమెరికా - ఇజ్రాయెల్ (America - Israel) ల మధ్య బంధం మరింత బలపడుతుందని భావిస్తున్నట్లు నెతన్యాహు పేర్కొన్నారు.






