ఇరాన్ న్యూ క్లియర్ ప్రోగ్రామ్ ను అడ్డుకుంటాం : నెతన్యాహు హెచ్చరిక

by Naga Rani Yarlagadda |

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మంగళవారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇరాన్‌తో యుద్ధ విరమణను 'Historic Victory'గా ప్రకటించారు.

ఇరాన్ న్యూ క్లియర్ ప్రోగ్రామ్ ను అడ్డుకుంటాం : నెతన్యాహు హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మంగళవారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇరాన్‌తో యుద్ధ విరమణను 'Historic Victory'గా ప్రకటించారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సంపాదించదని, సంపాదించనివ్వమి ఆయన హెచ్చరించారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తన దేశం అణు కార్యక్రమంపై మళ్లీ చర్చలకు సిద్ధంగా ఉందని ప్రకటించిన కొద్ది గంటలకే ఈ ప్రకటనలు వెలువడ్డాయి. అయితే.. తాము శాంతియుత అణుశక్తి వినియోగం విషయంలో హక్కులను నొక్కి చెబుతామంటూ ఇరాన్ స్పష్టం చేసింది.

"ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని పొందదని ప్రపంచానికి హామీ ఇస్తున్నాం. మేము వారి అణు ప్రాజెక్టును పూర్తిగా అడ్డుకున్నాం. మళ్లీ ఏ rebuild ప్రయత్నం చేసినా, మేము అదే తీరుతో, అదే కఠినతతో స్పందిస్తాం," అని నెతన్యాహు పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ దాడులు తీవ్రంగా పెరిగిన వేళ, అమెరికా కూడా రంగంలోకి దిగింది. బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ భూగర్భ అణు సదుపాయాలపై దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతిగా.. ఇరాన్ కూడా ఖతార్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌పై మిస్సైల్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితిని శాంతింపజేయాలని పిలుపునిచ్చి, యుద్ధ విరమణ ఒప్పందానికి పునాది వేశారు.

ఇరాన్ – ఇజ్రాయెల్ పరస్పర ఆరోపణలు

ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం.. తాము ఇరాన్ అణు ప్రోగ్రాంను కొన్ని సంవత్సరాల వెనక్కి నెట్టామని వెల్లడించింది. మరోవైపు ఇరాన్.. ఇజ్రాయెల్ "ఒత్తిడికి గురై" యుద్ధం ఆపాల్సి వచ్చిందని పేర్కొంది. ఇరాన్ రేవల్యూషనరీ గార్డ్స్ ఇటీవలి మిస్సైల్ దాడులను జ్ఞాపకంగా నిలిచే గుణపాఠంగా అభివర్ణించాయి. అధికార లెక్కల ప్రకారం 12 రోజుల యుద్ధంలో ఇరాన్‌లో 610 మంది పౌరులు మృతి చెందగా.. 4,700 మందికి పైగా గాయాలయ్యాయి. ఇజ్రాయెల్‌లో 28 మంది మరణించారు.

ఇక.. సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్, రష్యా మొదలైన దేశాలు ట్రంప్ ప్రకటించిన యుద్ధ విరమణను స్వాగతించాయి. అయితే.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మాక్రాన్ మాత్రం ఇరాన్ రహస్యంగా యూరేనియం అభివృద్ధికి ప్రయత్నించే అవకాశం ఉందని హెచ్చరించారు.

Next Story