ఇదేం తలతిక్క పని.. ఏసీ వేయమన్నందుకు కస్టమర్ పై ఉబెర్ డ్రైవర్ చిందులు (వీడియో)

by Prasad Jukanti |   (  Updated:2024-05-26 13:13:26  IST  )

ఏసీ వేయమని అడిగినందుకు సహనం కోల్పోయిన ఓ క్యాబ్ డ్రైవర్ కస్టమర్ పై చిందులు తొక్కాడు.

ఇదేం తలతిక్క పని.. ఏసీ వేయమన్నందుకు కస్టమర్ పై ఉబెర్ డ్రైవర్ చిందులు (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఏసీ వేయమని అడిగినందుకు సహనం కోల్పోయిన ఓ క్యాబ్ డ్రైవర్ కస్టమర్ పై చిందులు తొక్కాడు. ఎందుకు ఏసీ ఆన్ చేయడం లేదని ప్రశ్నించినందుకు ఇది తమ ప్రాంతమని ఇక్కడ మరో భాష కుదరని తెగేసి చెప్పాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ అథర్వ్ దావర్ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్ లో తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. బెంగళూరులో ఉబెర్ క్యాబ్ ను బుక్ చేసుకున్నానని కారులో ప్రయాణిస్తుండగా ఏసీ వేయాలని కోరగా డ్రైవరు అందుకు నిరాకరించారు. ఏదో సమస్య ఉందని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రాబ్లం ఏంటని నేను అడగ్గా మొదట్లో హిందీలోనే సమాధానం చెప్పిన క్యాబ్ డ్రైవర్ ఆ తర్వాత సహనం కోల్పోయారు. దాంతో ఎందుకు కోప్పడుతున్నారని హిందీలో అడగ్గా.. నో హిందీ, నో ఇంగ్లీష్.. ఓన్లీ కన్నడ, ఇది కర్నాటక ఇక్కడ కన్నడలో మాట్లాడితే మాట్లాడు లేదంటే వెళ్లిపో అంటూ ఆగ్రహంతో బదులిచ్చాడు.

దీనికి ఖంగుతిన్న కస్టమర్ తనను తీసుకువెళ్లడం ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్లాలని కోరారు. అయినా డ్రైవర్ ఏసీ వేయకుండానే ముందుకు సాగాడు. ఇదంతా వీడియోలో రికార్డు అయింది. సదరు డ్రైవర్ పై ఉబెర్ కు ఫిర్యాదు చేసినట్లు అథర్వ్ దావర్ పేర్కొన్నారు. ఇది భాషకు సంబంధించిన విషయం కాదని, బాధ్యతారహితమైన వ్యక్తి కన్నడ భాషను తెరగా ఉపయోగిస్తున్నాడని బెంగళూరుకు వచ్చే వారు ఇలాంటి మోసపూరితమైన వ్యక్తుల గురించి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాడు. కాగా ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలు గా రియాక్ట్ అవుతున్నారు.

Click Here For Twitter Post..

Next Story