Teacher arrest: వ్యాపారికి స్కూల్ టీచర్ వేధింపులు..!

by Shamantha N |

విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరే దారి తప్పింది. స్టూడెంట్ తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత అందినంత డబ్బు గుంజింది. ఇ

Teacher arrest: వ్యాపారికి స్కూల్ టీచర్ వేధింపులు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరే దారి తప్పింది. స్టూడెంట్ తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత అందినంత డబ్బు గుంజింది. ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేసింది. రూ.20 లక్షలు ఇవ్వకపోతే ప్రైవేటు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ కి దిగింది. దీంతో, బాధితుడు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. స్థానిక పాఠశాలలో శ్రీదేవి రుదగి అనే మహిళ టీచర్ గా పనిచేస్తుంది. అదే ఏరియాలో భార్య ముగ్గురు ఆడపిల్లలతో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి తన ఐదేళ్ల చిన్న కుమార్తెను స్కూల్లో వేయడానికి అక్కడికి వెళ్లాడు. ఈ సందర్భంగా శ్రీదేవికి, వ్యాపారిక మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర బంధానికి దారితీసింది. రుదగికి, వ్యాపారి సతీష్‌కు మద్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర బంధానికి దారితీసింది. ఆ బంధాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారి నుంచి శ్రీదేవి రూ.4 లక్షలు గుంజింది. ఇంకా డబ్బు అడగడంతో వ్యాపారి ఆమెను దూరంపెట్టాడు. దీంతో, గణేశ్‌ కాలే (38), సాగర్ (‌28) అనే స్నేహితుల సాయంతో వ్యాపారిపై రుదగి ఒత్తిడి పెంచింది. రూ.20 లక్షలు ఇవ్వకపోతే తనతో ప్రైవేటుగా గడిపిన వీడియోలు, ఫొటోలను అతడి భార్యకు పంపుతానని బెదిరించింది.

వ్యాపారికి వేధింపులు

శ్రీదేవి వేధింపులు తాళలేక వ్యాపారి గుజరాత్ కు మకాం మార్చాలనుకున్నాడు. కుమార్తె టీసీ కోసం స్కూల్ కి వెళ్తే అక్కడ శ్రీదేవి తన స్నేహితులపై వ్యాపారిని బెదిరించింది. ఈ సందర్భంగా తన దగ్గరున్న వీడియోలు, ఫొటోలను రుదగి.. సతీష్‌కు చూపించింది. రూ.20 లక్షలు ఇస్తావా.. లేదంటే వీడియోలను మీ ఇంట్లో వాళ్లకు పంపాలా అని బ్లాక్‌ మెయిల్‌ చేసింది. దాంతో భయపడిపోయిన సతీష్‌ రూ.15 లక్షలు ఇస్తానని ఒప్పుకుని బయటికి వచ్చాడు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వకపోవడంతో శ్రీదేవి నుంచి ఫోన్‌లు ఎక్కువయ్యాయి. వీడియోలో మీ భార్యకు పంపుతానంటూ నిత్యం బెదిరించసాగింది. దాంతో విసిగిపోయిన వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. విషయం అంతా తెలుసుకున్న పోలీసులు శ్రీదేవిని, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story