- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bengaluru Stampede : బెంగళూరు తొక్కిసలాట.. గవర్నర్-సీఎం మధ్య వివాదం
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) సమీపంలో జూన్ 4న జరిగిన తొక్కిసలాట(Bengaluru Stampede) ఘటనలో 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డ సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) సమీపంలో జూన్ 4న జరిగిన తొక్కిసలాట(Bengaluru Stampede) ఘటనలో 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనపై కర్ణాటకలో రాజకీయ వివాదం రాజుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddha Ramaiah), గవర్నర్(Governor) మధ్య వివాదం తలెత్తింది. విధాన్‌సౌధ(Vidhan Sabha)లో RCB సన్మాన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందా లేక KSCA నిర్వహించిందా అనే అంశంపై సీఎం సిద్ధరామయ్య, రాజ్‌భవన్(Raj Bhavan) మధ్య విభేదాలు తలెత్తాయి.
సీఎం ఈ కార్యక్రమం ప్రభుత్వ ఈవెంట్ కాదని, తాను కేవలం ఆహ్వానితుడిగా హాజరైనట్లు చెప్పగా, రాజ్‌భవన్ మాత్రం సీఎం గవర్నర్‌ను అధికారికంగా ఆహ్వానించారని, ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినదేనని వాదిస్తోంది. విధాన్‌సౌధలో జరిగిన RCB సన్మాన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదని, అది కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమమని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటకు విధాన్‌సౌధ కార్యక్రమానికి సంబంధం లేదని, స్టేడియం వద్ద జరిగిన ఘటనకు పోలీసులు సరైన ఏర్పాట్లు చేయలేదని ఆయన ఆరోపించారు.
కాగా విధాన్‌సౌధలో RCB ఆటగాళ్లను సన్మానించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్‌ను అధికారికంగా ఆహ్వానించారని రాజ్‌భవన్ జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గవర్నర్ మొదట RCB ఆటగాళ్లను రాజ్‌భవన్‌లో సన్మానించాలని ప్లాన్ చేశారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం విధాన్‌సౌధలో కార్యక్రమం నిర్వహిస్తామని చీఫ్ సెక్రటరీకి సమాచారం ఇచ్చినట్లు రాజ్‌భవన్ వెల్లడించింది.






