- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. పోలీసులు నిష్ప్రయోజకులు : ఎంపీ సంచలన పోస్ట్
మెట్రో పాలిటన్ సిటీల్లో, రాష్ట్ర రాజధాని నగరాల్లో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉండదు.

దిశ, వెబ్‌డెస్క్: మెట్రో పాలిటన్ సిటీల్లో, రాష్ట్ర రాజధాని నగరాల్లో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉండదు. ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాలేజీ స్టూడెంట్స్, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు ఇలా అందరూ ఒకే సమయంలో బయటికి రావడం, మళ్లీ ఒకే సమయంలో తిరిగి ఇళ్లకు చేరుకుంటుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్య పెరుగుతుంది. దీంతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఇబ్బంది ప్రజా ప్రతినిధి వస్తే గానీ ట్రాఫిక్ సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం కాలేనట్టుంది. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లేందుకు బెంగళూరు నుంచి బయల్దేరిన ఓ ఎంపీకి ట్రాఫిక్ సమస్య కోపం తెప్పించింది. అంతే.. నగర పోలీసులు నిష్ర్పయోజకులంటూ సోషల్ మీడియాలో సీరియస్ అయ్యారు.
సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి చాలా ఘోరంగా ఉందని వాపోయారు. ఆదివారం ఢిల్లీ వెళ్లేందుకు బయల్దేరగా.. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోయానని, ఎయిర్ పోర్టుకు సమయానికి చేరుకునేందుకు పోలీసుల్ని సంప్రదించినా స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు. నగరంలో ట్రాఫిక్ ను నియంత్రించలేకపోవడంతో.. అందమైన నగరం అపఖ్యాతిని మూటగట్టుకుంటోందన్నారు. ట్రాఫిక్ కారణంగా అందరి నుంచి విమర్శలు ఎదుర్కొంటోందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో.. నెట్టింట చర్చ మొదలైంది.






