- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bengaluru Metro: బెంగళూరులో కాస్ట్ లీ కానున్న ప్రయాణం
బెంగళూరులో ప్రయాణం కాస్ట్ లీగా మారనుంది. ఆర్టీసీ ఛార్జీల పెంపు మరువక ముందే మెట్రో ఛార్జీలు పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరులో ప్రయాణం కాస్ట్ లీగా మారనుంది. ఆర్టీసీ ఛార్జీల పెంపు మరువక ముందే మెట్రో ఛార్జీలు పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల మేరకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) టికెట్ ధరలను సవరించింది. కాగా.. పెరిగిన ధరలు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి. బెంగళూరు మెట్రో ప్రస్తుత గరిష్ఠ ధర రూ.60 ఉండగా.. ఇకపై రూ.90కు పెరగనుంది. అయితే, ధరల పెంపుతో పాటు ఉబర్, ఓలా తరహాలో పీక్, నాన్ పీక్ అవర్స్‌ను విధానాన్ని తీసుకొచ్చారు. ఉదయం రైళ్లు ప్రారంభమైనప్పటి నుంచి 8 గంటల వరకు; మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు; మళ్లీ రాత్రి 9 గంటల నుంచి చివరి వరకు ఆఫ్- పీక్ అవర్స్‌గా నిర్ణయించారు. అంటే మిగిలిన సమయాన్ని పీక్ అవర్స్‌గా పరిగణిస్తారు. స్మార్ట్‌కార్డులపై పీక్ అవర్స్ సమయంలో 10 శాతం, ఆఫ్ పీక్ అవర్స్‌లో 5 శాతం డిస్కౌంట్ ఇస్తారు.
బోర్డు ఆమోదం మేరకే..
ప్రతిపాదిత మెట్రో ఛార్జీల పెంపు నిర్ణయం ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారంటూ గత నెలలో బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా.. ఎంపీ అన్నట్లుగానే బీఎంఆర్‌సీఎల్ బోర్డు ఆమోదం మేరకు టికెట్ ధరలు ఫిబ్రవరి 9 నుంచి అమలు కానున్నాయని బీఎంఆర్‌సీఎల్ తెలిపింది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం మేర బస్సు ఛార్జీలను వడ్డించింది. కాగా.. ఇలాంటి సమయంలో మెట్రో ఛార్జీలు కూడా పెరుగుతుండడం బెంగళూరు వాసుల ప్రయాణం మరింత భారం కానుంది.






