బెంగళూరు కేఫ్ పేలుళ్లలో కీలక నిందితుడు అరెస్టు..

by Dishanational6 |
బెంగళూరు కేఫ్ పేలుళ్లలో కీలక నిందితుడు అరెస్టు..
X

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో కీలక నిందితుడ్ని అరెస్టు చేశారు ఎన్ఐఏ అధికారులు. మూడు రాష్ట్రాల్లోని 18 చోట్ల విస్తృతంగా గాలించిన తర్వాత అతడ్ని అరెస్టు చేశారు. మార్చి 1న కేఫ్ లో జరిగిన బాంబు పేలుడులో పది మంది గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు కర్ణాటకలోని 12 చోట్ల, తమిళనాడులో 5 చోట్ల, ఉత్తరప్రదేశ్ లోని ఒక ప్రాంతంలో దాడులు జరిపారు.

పేలుడులో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి కస్టమర్ వేషంలో కేఫ్‌లోకి వచ్చి అక్కడే బాంబు ఉన్న బ్యాగును పెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి బాంబు పేలింది. ఈ కేసులో ముఖ్య నిందితుడు ముజావిర్ షాజీబ్ హుస్సేన్‌ని, మరో కుట్రదాడురు అబ్దుల్ మతీన్ తాహాని గుర్తించారు అధికారులు. దాడికి నెల రోజుల ముందు నుంచి ముస్సావిర్, తాహాలు చెన్నైలోని ఓ లాడ్జిలో ఉన్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. కాగా.. ప్రధాన నిందితులకు సాయం చేసిన ముజిమ్మిల్ షరీఫ్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ముగ్గురు అనుమానితుల ఇళ్లలో ఎన్ఐఏ మార్చి 17న సోదాలు నిర్వహించి, నగదు, పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది.


Next Story

Most Viewed