మేకప్ రూమ్‌లో బంధించి.. 5 నెలలుగా నన్ను స్టార్ నిర్మాత వేధించాడు.. స్టార్ నటి షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 9 |
మేకప్ రూమ్‌లో బంధించి.. 5 నెలలుగా నన్ను స్టార్ నిర్మాత వేధించాడు.. స్టార్ నటి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీ ఎంత డెవలప్ అవుతోన్న కొన్ని చెప్పుకోలేని దారుణాలు జరుగుతూనే ఉన్నాయంటూ నెట్టింట వార్తలు వింటూనే ఉంటాం. కొంతమంది ధైర్యంగా మీడియా ముందుకొచ్చి తమ కెరీర్‌లో ఎదుర్కొన్న చెదు అనుభవాలను బయటపెట్టగా.. మరికొంతమంది భయాలతో అక్కడిక్కడే సమాధి చేసేస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ సీరియల్ నటికి ఎదురైన చెదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘‘ఒక స్టార్ నటి హోదాలో ఉన్న కూడా వేధింపులు ఉంటాయని ఇండస్ట్రీకి వచ్చాకే తెలిసింది. స్వయంగా నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నన్ను ఓ నిర్మాత వేధిస్తున్నాడని వాపోయింది.

నిర్మాత కారణంగా కొన్ని నెలలుగా డిప్రెషన్‌తో, ఆందోళనకు గురయ్యానని, షో సెట్స్ లో నన్ను టార్చర్ చేశాడని తెలిపింది. నా హెల్త్ బాగోలేకపోవడంతో నేను షూటింగ్ చేయలేకపోయానని, దీంతో నన్ను మేకప్ గది లోపల లాక్ చేశారని చెప్పింది. ఆ షో టీమ్.. నేను బట్టలు మార్చుకునేటప్పుడు వారు నా మేకప్ రూం డోర్ పగలగొట్టేవారని, సమ్ టైమ్స్ డోర్స్ బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తారేమోనని అనిపించేదని, 5 నెలలుగా నాకు రెమ్యునరేషన్ ఇవ్వకుండా టార్చర్ చేశారని వాపోయింది. ఇన్ని డేస్ ఈ ఘటనపై మాట్లాడటానికి ధైర్యం చాలలేదని వెల్లడించింది. ప్రస్తుతం నేను ఎలాంటి పరిస్థితినైన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని శుభ్ షగున్ సీరియల్ నటి కృష్ణ ముఖర్జీ చెప్పుకొచ్చింది.



Next Story

Most Viewed