బల్మూరు గ్రామస్తుల సంచలన నిర్ణయం.. పార్లమెంట్ ఎన్నికల బహిష్కరణ

by Disha Web Desk 4 |
బల్మూరు గ్రామస్తుల సంచలన నిర్ణయం.. పార్లమెంట్ ఎన్నికల బహిష్కరణ
X

దిశ, ఆచంపేట : నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండల గ్రామస్తులు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అందుకు ప్రధాన కారణం ఉమామహేశ్వర రిజర్వాయర్ ప్రాజెక్టును మా భూముల ముంపు చేసి నిర్మించేలా సర్వే చేసినందుకు నిరసనగా గ్రామస్తులు మూకుమ్మడిగా మరో పోరాటానికి సిద్ధమయ్యారు. బుధవారం గ్రామంలో పలు కూడళ్లలో ఉమామహేశ్వర రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లను నిర్మించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి అనంతరం అచ్చంపేట లింగాల ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ భూములు కోల్పోతున్నామని, ఉన్న సారుడు భూమి లేకుంటే మా బతుకులు ఆగమయితాయని.. కావున పాలకులు ప్రాజెక్టు నిర్మాణం కోసం రీడిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ ఉన్నందున అనుమతులు లేకుండా నిరసనలు చేయడం చట్ట విరుద్ధమని అందుకు కొందరు రైతులపైన కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేవరకు ఎన్నికలను బహిష్కరిస్తూ తదుపరి మా పోరాటాన్ని ఉధృ‌తం చేస్తామని గ్రామస్తులు తెలిపారు.

Next Story

Most Viewed