దక్షిణ భారతదేశానికి నీటి సంక్షోభం తప్పదా..?

by Dishanational6 |
దక్షిణ భారతదేశానికి నీటి సంక్షోభం తప్పదా..?
X

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గుతోంది. రిజర్వాయర్లల్లో 17శాతం మాత్రమే తగ్గిపోయిందని నివేదికలు తెలుపుతున్నాయి. రానున్న రోజుల్లో ప్రజలు తీవ్ర కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రకారం.. దక్షిణ ప్రాంతంలో సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో 42 రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 53.334 బిలియన్ క్యూబిక్ మీటర్లు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఉన్నాయి. ఈ మేరకు సీడబ్ల్యూసీ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ రిజర్వాయర్లలో ప్రస్తుత మొత్తం నిల్వ 8.865 బిలియన్ క్యూబిక్ మీటర్లు.. కాగా, ఇది వాటి మొత్తం సామర్థ్యంలో 17 శాతం మాత్రమే.

దక్షిణ ప్రాంతాల్లో నీటి సంక్షోభం

దక్షిణ ప్రాంతంలో రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఈ సమస్య పెరుగుతున్న కొద్ది నీటి కొరత ఏర్పడుతుంది. సాగునీరు, తాగునీరు, జలవిద్యుత్ కు సవాలుగా మారనుంది. దీంతో, రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

తూర్పు ప్రాంతాల్లో పెరిగిన నీటి నిల్వలు

ఇకపోతే, దీనికి విరుద్ధంగా, అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలతో సహా దేశంలోని తూర్పు ప్రాంతాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో గతేడాది నీటి నిల్వలు పెరిగాయి. పదేళ్ల సగటుతో పోలిస్తే నీటి నిల్వ స్థాయిలో గణనీయమైన సానుకూల మెరుగుదల నమోదైంది. వర్షాలు బాగా కురుస్తుండటంతో ఇక్కడ తగినంత నీరు ఉంది. రిజర్వాయర్లల్లలో నీరు ఉండటంతో.. ఇబ్బందులు తలెత్తడం లేదు. తూర్పు ప్రాంతంలో ప్రస్తుతం 23 మానిటరింగ్ రిజర్వాయర్లలో మొత్తం 20.430 బీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 7.889 బీఎంసీ నీరు ఉన్నట్లు కేంద్ర జలసంఘం తెలిపింది. అంటే మొత్తం సామర్థ్యంలో 39 శాతం ఇది.

ఉత్తర, మధ్య ప్రాంతాల్లో తగ్గిన నీటి నిల్వలు

మరోవైపు, పశ్చిమ ప్రాంతంలో గుజరాత్, మహారాష్ట్ర ఉన్నాయి. ఇక్కడ నీటి నిల్వ స్థాయి 11.771 బీఎంసీలు. 49 మానిటరింగ్ రిజర్వాయర్ల మొత్తం సామర్థ్యంలో ప్రస్తుత నీటిమట్టం 31.7 శాతం. పదేళ్ల సగటు కంటే గతేడాది నిల్వ స్థాయి కూడా తక్కువగా ఉంది. ఇది కాకుండా, దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లోనూ నీటి నిల్వ స్థాయిలు తగ్గిపోయాయి.



Next Story

Most Viewed