- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తోడా ‘స్టఫ్’ డాలో భయ్యా! పానీపూరి కాదు.. లిక్కర్ పూరి! వెరైటీ టేస్ట్!
దిశ, డైనమిక్ బ్యూరో: పానీపూరి అనేది ఒక ఎమోషన్. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తినే ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. బాగా చదువుకున్న వారు సైతం పానీపూరి బండి పెట్టుకోవాలని కూడా చూస్తుంటారు. తాజాగా పానీపూరికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పానీపూరిలో ఆలు స్టఫ్‌తో పాటు పానీ నింపి తినడం చూశాము. కానీ అందుకు భిన్నంగా మందుబాబులు పానీపూరిని వెరైటీగా తింటున్నారు.
పానీ పూరిలో వాడే పానీ బదులుగా అందులో లిక్కర్ పోసి మందుబాబులు తినేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు లిక్కర్ పూరి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. భయ్యా తోడా ప్యాజ్ డాలో అని పానీపూరి బండి దగ్గర అంటారు.. కానీ ఇక్కడ భయ్యా తోడా స్టఫ్ డాలో అనాలేమోనని ఈ వీడియో చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. కాగా, పానీపూరి ఎక్కువ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కొందరు వ్యాపారులు నాణ్యత పాటించకుండా పానీ పూరి తయారు చేస్తున్న విషయం విదితమే.